నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్: ఓటేసిన సభాపతి పోచారం
- ఉదయం 9కు ప్రారంభమైన ఓటింగ్
- సాయంత్రం 5 వరకు కొనసాగింపు
- జిల్లా వ్యాప్తంగా 50 పోలింగ్ స్టేషన్లు
- 824 మంది ఓటర్లు
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 50 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. 824 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఓట్లు వేశారు. బాన్సువాడలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తెలంగాణ అసెంబ్లీ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా, నిజామాబాద్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 67 మంది, అత్యల్పంగా చందూర్‌లో నలుగురు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 483 మంది నిజామాబాద్ జిల్లా ఓటర్లు కాగా, 341 మంది కామారెడ్డి జిల్లా ఓటర్లు ఉన్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 12న కౌంటింగ్ నిర్వహిస్తారు.