రెడ్డీస్ ల్యాబ్‌కు సీడీఎస్‌సీవో షాక్.. స్పుత్నిక్ టీకా భారీ స్థాయి ట్రయల్స్‌కు నిరాకరణ
- భారీ ట్రయల్స్‌కు అనుమతులు కోరిన డాక్టర్ రెడ్డీస్
- స్పుత్నిక్ టీకా భద్రతపై సీడీఎస్‌సీవో అనుమానాలు
- తొలుత చిన్న స్థాయిలో ట్రయల్స్ నిర్వహించాలని సూచన
డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీకి కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో)లో ఎదురుదెబ్బ తగిలింది. కొవిడ్‌కు అడ్డుకట్ట వేసేందుకు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకాకు భారత్‌లో భారీ స్థాయిలో ట్రయల్స్ నిర్వహించాలని రెడ్డీస్ భావించింది. ఈ మేరకు సీడీఎస్‌సీవోకు ప్రతిపాదన పంపింది.
అయితే, స్పుత్నిక్ వ్యాక్సిన్ భద్రత, రోగనిరోధకతపై వివిధ దేశాల్లో నిర్వహించిన అధ్యయనాలు చాలా చిన్నవని, వీటిపై సమాచారం చాలా తక్కువగా ఉందని సీడీఎస్‌సీవో పేర్కొంది. ఈ పరిస్థితుల్లో భారీ స్థాయిలో ట్రయల్స్ సరికాదని స్పష్టం చేసింది. తొలుత కనీస స్థాయిలో ట్రయల్స్ నిర్వహించాలని సూచించింది.