హుజూరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ. 2 కోట్ల మేర ఆస్తి నష్టం
- భగీరథ పరికరాలు ఉంచిన గదిలో చెలరేగిన మంటలు
- మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
- షార్ట్‌సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. భగీరథ ప్రాజెక్టుకు సంబంధించిన పరికరాలు ఉంచిన గదిలో ఒక్కసారిగా మంటలు అంటుకుని ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని ప్రాథమికంగా తేలింది. పరికరాలు కాలి బూడిదవడంతో దాదాపు రూ. 2 కోట్ల మేర నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.