జగన్ మామ ప్రభుత్వంలో బాగా చదువుకుంటామని పిల్లలు చెప్పాలి: ముఖ్యమంత్రి జగన్ 

  • ప్రపంచంతో పోటీ పడే శక్తి పేదపిల్లల్లో రావాలి
  • పిల్లలు బడి ఎందుకు మానేస్తున్నారో గత పాలకులు ఆలోచించలేదు
  • ఇంటర్ తర్వాత కూడా ఇంజినీరింంగ్, మెడిసిన్ చదవాలి
పిల్లలందరూ బాగా చదువుకుని, ఉన్నతమైన జీవితాన్ని గడపాలనేదే తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి వారి చదువు అయిపోయేదాకా మేనమామలా అండగా ఉంటానని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడే శక్తి పేదపిల్లల్లో కూడా రావాలని.. అందుకే విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చామని తెలిపారు.

ఎవరూ ఎత్తుకుపోలేని ఆస్తి చదువేనని అన్నారు. పిల్లలు ఎందుకు బడి మానేస్తున్నారో గత పాలకులు ఆలోచించలేదని... అందుకే మన దగ్గర 34 శాతం నిరక్ష్యరాస్యత ఉందని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం చదువు పేదలకు అందకుండా పోయిందని గుర్తు చేశారు. జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు అమలు చేస్తున్నామని జగన్ అన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. జగన్ మామ ప్రభుత్వంలో బాగా చదువుకుంటున్నామని పిల్లలు గొప్పగా చెప్పాలని అన్నారు. బడికి వచ్చే పిల్లలకు గోరుముద్ద కింద రోజుకో రకమైన వంటకంతో భోజనం పెడుతున్నామని చెప్పారు.

 ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు ఇంజినీరింగ్, మెడిసిన్ చదవాలని అన్నారు. పిల్లల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా విద్యాదీవెన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. వసతిదీవెన పథకం కింద తొలి విడత డబ్బు ఇచ్చామని, నవంబర్ లో రెండో విడత ఇస్తామని తెలిపారు. పిల్లల చూపు బాగుండాలనే ఉద్దేశంతో కంటివెలుగు పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.


More Telugu News