తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏర్పడకపోవడం దురదృష్టకరం: టీడీపీ నేత నారా లోకేశ్
- తెలంగాణలో దిశ వంటి ఘటనలు జరిగాయి
- అయినప్పటికీ మహిళా కమిషన్ ఏర్పడకపోవడం దురదృష్టకరం
- మహిళల హక్కులను కాపాడేందుకు నడుం కడదాం
- మహిళా కమిషన్ ఏర్పాటుపై ఒత్తిడి తెద్దాం
తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏర్పాటు కాకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు చాలా కాలంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ కూడా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో రాష్ట్ర సర్కారుపై ఒత‌్తిడి తీసుకొద్దామని చెప్పారు.
"దిశ వంటి ఘటనలు జరిగాక కూడా తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏర్పడకపోవడం దురదృష్టకరం. మహిళల హక్కులను కాపాడేందుకు నడుం కడదాం. మహిళా కమిషన్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు #TSNeedsWomenCommission అంటూ ట్విట్టర్ వేదికగా తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో డిమాండ్ చేద్దాం" అని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.