సోమ, మంగళ వారాల్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు?
- ఇటీవలే ముగిసిన తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు
- జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణల కోసం ప్రత్యేకంగా మరోసారి సమావేశాలు
- హైకోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లో చట్టాలు
- శుక్రవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు గత నెల ముగిసిన విషయం తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ సమావేశాలను నిర్వహించారు. కీలక బిల్లులన్నీ ఆమోదం పొందాయి. ఇటీవలే అసెంబ్లీలో 8 బిల్లులు, కౌన్సిల్లో 4 బిల్లులు పాస్ అయ్యాయి. రెండు సభల్లో ఆమోదం పొందిన వాటిల్లో రెవెన్యూ బిల్లు కూడా ఉంది. అయితే, తెలంగాణ అసెంబ్లీ త్వరలోనే మరోసారి ప్రత్యేకంగా రెండు రోజుల పాటు సమావేశమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.
"జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉన్నందున వచ్చే సోమ, మంగళవారాల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీనిపై శుక్రవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది" అని తెలంగాణ సీఎంవో ప్రకటన చేసింది.