ఎంఐఎంతో వివాదం.. బేగంబజార్ బంద్ కు బీజేపీ పిలుపు
- శ్మశానవాటిక వద్ద టాయిలెట్ నిర్మాణంతో వివాదం
- బీజేపీ-ఎంఐఎం నేతల మధ్య వాగ్వాదం
- బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొన్న వ్యాపారులు
హైదరాబాదులోని ఓల్డ్ సిటీ అంటే చాలా సున్నితమైన ప్రాంతం అనే విషయం అందరికీ తెలిసిందే. అక్కడ ఏ చిన్న వివాదం చోటు చేసుకున్నా పెద్ద రచ్చగా మారుతుంది. తాజాగా ఓల్డ్ సిటీలోని బేగంబజార్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
స్థానికంగా ఉన్న శ్మశానవాటిక వద్ద చేపట్టిన టాయిలెట్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఈ అంశానికి సంబంధించి బీజేపీ-ఎంఐఎం నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంఐఎం తీరును నిరసిస్తూ బేగంబజార్ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ బంద్ లో వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మరోవైపు నిరసన ర్యాలీకి బీజేపీ శ్రేణులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.