హైదరాబాద్ లోకల్ టీవీ చానల్ కు 'నిశ్శబ్దం' టీమ్ నోటీసులు!

  • అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన నిశ్శబ్దం
  • త్వరలోనే ప్రసారం చేస్తున్నామంటూ చానల్ లో ప్రకటన
  • రూ.1.1 కోట్లు చెల్లించాలన్న చిత్ర నిర్మాతలు
అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే నటించిన చిత్రం నిశ్శబ్దం. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో దీనిని స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించారు. అయితే,  హైదరాబాద్ కు చెందిన ఓ స్థానిక టీవీ చానల్ త్వరలోనే నిశ్శబ్దం చిత్రాన్ని ప్రసారం చేస్తున్నామంటూ ప్రకటించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన నిశ్శబ్దం చిత్ర నిర్మాతలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.1.1 కోట్లు చెల్లించాలంటూ సదరు చానల్ కు నోటీసులు పంపారు.

అటు, నిశ్శబ్దం చిత్ర ప్రసార హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ కూడా ఆ చానల్ ను రూ.30 లక్షలు చెల్లించాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిశ్శబ్దం చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ నిర్ధారించారు. ఈ చిత్రాన్ని కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.


More Telugu News