ఢిల్లీ - బెంగళూరు విమానంలో ప్రసవించిన మహిళ!

ఢిల్లీ - బెంగళూరు విమానంలో ప్రసవించిన మహిళ!
  • 6ఈ 122లో ప్రసవించిన మహిళ
  • నిన్న సాయంత్రం 6.10 గంటలకు ప్రసవం
  • తల్లీ బిడ్డా క్షేమమేనన్న కెప్టెన్
ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఇండిగో విమానం 6ఈ 122లో ఓ మహిళ నెలలు నిండకుండానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వెల్లడించిన ఇండిగో ఎయిర్ లైన్స్, తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని తెలిపారు. ఢిల్లీ నుంచి బుధవారం రాత్రి 5.30 గంలకు విమానం బయలుదేరగా, కాసేపటికే ఓ మహిళకు పురుటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. ఆపై విమాన సిబ్బంది ప్రత్యేక సేవలను అందించగా, 6.10 గంటల సమయంలో బిడ్డను ప్రసవించింది.

ఈ విషయాన్ని వెల్లడించిన విమాన కెప్టెన్ క్రిష్టోఫర్, తన విమానంలో ఓ మహిళ, బిడ్డకు జన్మనివ్వడం గర్వంగా ఉందని, వారిద్దరూ క్షేమమేనని ట్వీట్ చేశారు. విమానం 7.30 గంటల సమయంలో బెంగళూరులో ల్యాండ్ కాగానే, తల్లీ బిడ్డలను ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు.


More Telugu News