ప్రేమించిన అమ్మాయి కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు... తేనెటీగల ప్రతాపం
- పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఘటన
- రాత్రంతా సెల్ టవర్ పైనే గడిపిన యువకుడు
- పోలీసుల సూచనతో కిందికి వస్తుండగా తేనెటీగల దాడి
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. గతకొంతకాలంగా తమ డిమాండ్ల సాధనకు ప్రజలు సెల్ టవర్లు ఎక్కడం పరిపాటిగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెంలో రోహిత్ అనే యువకుడు కూడా సెల్ టవర్ ఎక్కాడు. ప్రేమించిన అమ్మాయి వస్తే తప్ప తాను కిందికి దిగేది లేదని మొండిగా వ్యవహరించాడు. మంగళవారం రాత్రంతా అతను సెల్ టవర్ పైనే ఉన్నాడు.
అయితే, బుధవారం పోలీసులు వచ్చి అతడికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కిందికి వస్తే మాట్లాడుకుందాం అని అతడిలో నమ్మకం కలిగించారు. పోలీసుల సూచనను పాటించి సెల్ టవర్ నుంచి కిందికి దిగుతున్న రోహిత్ పై తేనెటీగలు దాడి చేశాయి. దొరికిన చోటల్లా కుట్టి తమ ప్రతాపం చూపించాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు రోహిత్ సెల్ టవర్ పైనుంచి పక్కనే ఉన్న కల్యాణమంటపంలోకి దూకేశాడు.
మరోవైపు పోలీసులు, మీడియా సిబ్బంది కూడా తలోదిక్కుకు పరుగెత్తాల్సి వచ్చింది. కాసేపటికి తేనెటీగలు శాంతించడంతో పోలీసులు గాయపడిన రోహిత్ ను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ప్రేమికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.