మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారయత్నం... రాష్ట్రంలో పరిస్థితికి ఇదే నిదర్శనం: నారా లోకేశ్
- గాజువాక వాంబే కాలనీలో ఘటన
- బాధితురాలి కుటుంబసభ్యులకు లోకేశ్ ఫోన్
- ఆ బాలికకు అన్నగా అండగా ఉంటానని హామీ
విశాఖపట్నం గాజువాక వాంబే కాలనీలో ఓ మైనర్ బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారయత్నం చేసిన ఘటన రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల తీవ్రతను తెలియజేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
బాధిత బాలిక తండ్రి, మేనత్తతో తాను ఫోన్ లో మాట్లాడానని, బాలికకు అన్నగా అండగా ఉంటానని హామీ ఇచ్చానని వెల్లడించారు. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన ఆ పాస్టర్ కు కఠినశిక్ష పడేలా వారి కుటుంబం చేస్తున్న పోరాటానికి టీడీపీ మద్దతుగా నిలుస్తుందని లోకేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన బాధితురాలి కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన వీడియోను పంచుకున్నారు.