దివంగత వైఎస్ విగ్రహం ధ్వంసం... శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తత!
- నెల రోజుల క్రితం ప్రతిష్ఠించబడిన విగ్రహం
- కింద పడేసి వెళ్లిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు
- కేసును విచారిస్తున్న పోలీసు అధికారులు
దాదాపు నెల రోజుల క్రితం ప్రతిష్ఠించిన మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో శ్రీకాకుళం జిల్లా భామిని మండలం కొరమ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ప్రాంతం నుంచి పెకిలించి కింద పడవేశారు. ఉదయాన్నే దీన్ని చూసిన స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
కాగా, ఈ విగ్రహాన్ని గత నెల 2వ తేదీన డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ ఆవిష్కరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తూ, విచారణ ప్రారంభించారు. వైఎస్ విగ్రహ విధ్వంసాన్ని పాలకొండ ఎమ్మెల్యే కళావతి, డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ తీవ్రంగా ఖండించారు.
విగ్రహం ఏర్పాటు సమయంలో గ్రామంలో ఎటువంటి వివాదాలూ లేవని, అందరూ కలిసి ఏకగ్రీవంగా దీన్ని ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించిన విక్రాంత్, కావాలనే కొందరు సంఘ విద్రోహశక్తులు దీన్ని నాశనం చేశారని, పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని, వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.