ముంబైతో మ్యాచ్‌లో ఓడిన రాజస్థాన్‌కు మరో షాక్.. కెప్టెన్ స్మిత్‌కు జరిమానా

  • స్లో ఓవర్ రేటు కారణంగా రూ. 12 లక్షల జరిమానా విధించిన ఐపీఎల్
  • ఇప్పటికే కోహ్లీ, శ్రేయాస్‌లకు జరిమానా
  • నిన్నటి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిన రాజస్థాన్
ఐపీఎల్‌లో భాగంగా నిన్న రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన రాజస్థాన్ రాయల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు సారథి స్మిత్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు. లీగ్ ప్రవర్తనా నియమావళి ప్రకారం మొదటి నేరం కింద రూ. 12 లక్షలు విధించినట్టు తెలిపారు.

నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 194 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ 57 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. కాగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ, ఢిల్లీ కేపిటల్స్ స్కిప్పర్ శ్రేయాస్ అయ్యర్‌లు ఇప్పటికే స్లో ఓవర్ రేటుకు జరిమానా చెల్లించారు.


More Telugu News