దేశంలో 67 లక్షల మార్కును దాటిన కొవిడ్ కేసులు
- నిన్న 72,049 కేసులు వెలుగులోకి
- ఇప్పటివరకు కరోనాకు 1,04,555 మంది బలి
- ఇంకా యాక్టివ్‌గా 9,07,883 కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుని దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 67 లక్షల మార్కును చేరుకుంది.
ఇక నిన్న ఒక్క రోజులో ఏకంగా 72,049 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 67,57,132కు చేరుకుంది. వీటిలో 9,07,883 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. 57,44,694 మంది కోలుకోగా నిన్న 986 మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు. తాజా మరణాలతో కలుపుకుని ఇప్పటి వరకు 1,04,555 మరణాలు సంభవించాయి.