గాలిలో ఉన్న కరోనా నాలుగు గంటల తర్వాత కూడా వ్యాప్తి: సీడీసీ
- కరోనా రోగుల నుంచి గాలిలో కలిసే వైరస్ కొన్ని గంటలపాటు ఉంటుంది
- ఇది రెండుమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు
- వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి
కరోనా వైరస్ గాలిలో చేరిన నాలుగు గంటల తర్వాత కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది. కరోనా వ్యాధిగ్రస్తుల నుంచి వెలువడే తుంపర్లు, రేణువులు పొగలా గాలిలో కలిసిపోయి నేలమీద పడతాయని, అందుకే ఆరడుగుల దూరం నిబంధన పెట్టినట్టు తెలిపింది.
అయితే, తుంపర్లలోని వైరస్ కొన్ని సెకన్ల నుంచి గంటల వరకు గాలిలో ఉంటుందని, ఇది రెండుమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదని వివరించింది. వెలుతురు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆరడుగుల దూరం పాటించినప్పటికీ వైరస్ ఇతరులకు సోకినట్టు ఆధారాలు ఉన్నట్టు సీడీసీ తెలిపింది. కాబట్టి తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.