హ్యాట్సాఫ్ ధోనీ... నీలోని గొప్పతనం ఇదే: బ్రెట్ లీ
- తొలి నాలుగు మ్యాచ్ లలో రాణించని వాట్సన్
- అయినా నమ్మకముంచి ఐదో చాన్సిచ్చిన ధోనీ
- చెలరేగి ఆడి ఫామ్ లోకి వచ్చిన వాట్సన్
- ధోనీ ఆటగాళ్లను నమ్ముతాడన్న బ్రెట్ లీ
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఓపెనర్ షేన్ వాట్సన్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాట్సన్ ఎలా ఆడతాడోనన్న విశ్లేషణలూ చాలా వచ్చాయి. అయితే, తొలి నాలుగు మ్యాచ్ లలో వాట్సన్ చేసింది కేవలం 52 పరుగులు. అంటే, సరాసరిన ఒక్కో మ్యాచ్ లో 13 పరుగులే చేశాడు. దీంతో వాట్సన్ ను తొలగించి, మరో ప్లేయర్ ను ధోనీ ఎంచుకుంటాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే... అలా జరుగలేదు.
తాజాగా, ఆదివారం నాటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మొత్తం మారిపోయింది. చెన్నై జట్టు 175 పరుగులు ఛేజ్ చేయాల్సి వచ్చిన వేళ, తన సహచరుడు డూప్లెసిస్ తో కలిసి వాట్సన్ ఒంటిచేత్తో మ్యాచ్ ని గెలిపించాడు. ఈ మ్యాచ్ లో 53 బంతుల్లోనే వాట్సన్ 83 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయం తరువాత, ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ బ్రెట్ లీ స్పందించాడు.
"ధోనీలోని గొప్పతనం అదే. అతను తన ఆటగాళ్లను నమ్ముతాడు. వరుసగా వైఫల్యాలు చెందుతున్నా వారిని విడిచి పెట్టడు. ఓపెనర్లు ఫామ్ లోకి రావడంతో ఇప్పుడిక చెన్నై సింహాలు నిశ్చింతగా నిద్రపోతాయి. విఫలమవుతున్నా వాట్సన్ కు అవకాశాలు ఇవ్వడంలో ధోనీ ఏ మాత్రమూ వెనుకంజ వేయలేదు. హ్యాట్స్ ఆఫ్ టూ ఎంఎస్డీ. వాట్సన్ లోని అసలైన ఆటగాడు బయటకు వచ్చాడు. తదుపరి గేమ్ లలో చెన్నైని నిలువరించడం మరింత కష్టతరమవుతుంది" అని బ్రెట్ లీ వ్యాఖ్యానించాడు.