తగ్గిన వరద... మూసుకున్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు!
- 30 వేల క్యూసెక్కులకు పడిపోయిన వరద
- అంతే మొత్తం నీరు దిగువకు
- సాగర్ కు చేరుకున్న 18 వేల క్యూసెక్కులు
కృష్ణా నదిలో కొనసాగుతున్న వరద ప్రవాహం క్రమంగా తగ్గుతూ ఉండటంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జలాశయంలోని 30 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని, ఈ నీటిని వివిధ ఎత్తిపోతల పథకాలతో పాటు, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. మొత్తం 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 214 టీఎంసీల నీరుందని అన్నారు. కాగా, నాగార్జున సాగర్ జలాశయానికి 18 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఆ నీటిని కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు వదులుతున్నారు.