పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చిక్కుల్లో బీజేపీ నేత రఘునందన్ రావు!
- శామీర్ పేట వద్ద రూ.40 లక్షలు పట్టుకున్న పోలీసులు
- పోలీసుల అదుపులో నలుగురు వ్యక్తులు
- రఘునందన్ ను పోలీసులు ప్రశ్నించే అవకాశం!
హైదరాబాద్ శివారు ప్రాంతం శామీర్ పేట అవుటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు నలుగురు వ్యక్తుల నుంచి రూ.40 లక్షల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. వీరిని డీసీపీ పద్మజ విచారించారు. ఈ డబ్బును దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఇచ్చేందుకు తీసుకెళుతున్నట్టుగా వారు చెప్పినట్టు తెలిసింది. ఈ డబ్బు నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపారు.
డబ్బు తరలిస్తున్న వ్యక్తులకు, రఘునందన్ పీఎ సంతోష్ కు మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్టు వెల్లడైందని, దీనికి సంబంధించిన ఆడియోను సేకరించామని చెప్పారు. ఈ డబ్బు పటాన్ చెరు నుంచి సిద్ధిపేట తీసుకెళ్తున్నట్లు తెలిసిందని ఆమె వివరించారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో పెద్దమొత్తంలో నగదు లభ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు రఘునందన్ ను ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.