నేను చనిపోయేలోపు ఒక్కసారయినా డేవిడ్‌ అటెన్‌బరోను కలవాలనుంది: పూరీ జగన్నాథ్

  • అటెన్‌బరో ఒక నేచురల్‌ హిస్టారియన్‌
  • ఆయన పేరు చాలా మందికి తెలియదు
  • గాంధీ సినిమాను తీసిన రిచర్డ్ అటెన్‌బరో తమ్ముడే ఈయన
  • డిస్కవరీ, నేషనల్‌ జియోగ్రఫీకి ఆయనే కారణం 
పూరీ మ్యూజింగ్స్‌లో తనలోని భావాలను, భావోద్వేగాలను గురించి తెలుపుతోన్న సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తాజాగా తనకు ఎంతో ఇష్టమైన  నేచురల్‌ హిస్టారియన్‌ డేవిడ్‌ అటెన్‌బరో (94) గురించి మాట్లాడారు. తాను చనిపోయేలోపు జీవితంలో ఒక్కసారైనా ఆయనను కలవాలనుకుంటున్నానని చెప్పారు.

డేవిడ్‌ అటెన్‌బరో పేరు చాలా మందికి తెలియదని, అయితే గాంధీ సినిమాను తీసిన రిచర్డ్ అటెన్‌బరో పేరు మాత్రం తెలిసే ఉంటుందని చెప్పారు. ఆయన తమ్ముడే ఈ డేవిడ్‌ అటెన్‌బరో అని వివరించారు. ఆయనొక నేచురల్‌ హిస్టారియన్‌ అని, 1926లో లండన్‌లో పుట్టాడని తెలిపారు.

అయితే చిన్నప్పటి నుంచి ఫాజిల్స్, పురాతనమైన స్టోన్స్,  నేచురల్‌ స్పెసిమెన్స్‌ సేకరించడం ప్రారంభించారని చెప్పారు.కేమ్‌ బ్రిడ్జి వర్సిటీలో జియోలజీ, జువాలజీ చదివారని వివరించారు. ఆయనకు ప్రకృతి‌ అంటే చాలా ఇష్టమని, ఆయనకు బీబీసీలో ఉద్యోగం‌ వచ్చిందని అన్నారు. అందులో యానిమల్‌ ప్యాట్రన్స్ అని ఒక సిరీస్‌ చేశారని తెలిపారు.

అనంతరం యాంత్రోపాలజీలో పీజీ పూర్తి చేశారని, జంతువులను ఇంకా పూర్తిగా స్టడీ చేయడం ప్రారంభించారని చెప్పారు. వాటిని ఫిల్మింగ్‌ చేద్దామని, లైఫ్‌ ఆన్‌ ఎర్త్ పేరిట స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారని తెలిపారు. బీబీసీ కూడా అతనికి  మద్దతు ఇచ్చిందని తెలిపారు. అయితే, అది షూట్‌ చేయడం చాలా ఖర్చుతో కూడుకుంటుందని చెప్పారు.

జంతువులను రోజూ అనుసరిస్తూ నెలలు, సంవత్సరాల పాటు తీయాల్సి ఉంటుందని చెప్పారు. ఆయనలో ఉన్న ఆసక్తి చూసి బీబీసీ దాన్ని ప్రారంభించిందని తెలిపారు. బీబీసీ కోసం ఆయన వైల్డ్ లైఫ్‌ మీద ఎన్నో డాక్యుమెంటరీలు‌ తీశారని వివరించారు. బీబీసీ, డిస్కవరీ, నేషనల్‌ జియోగ్రఫీ ఇలా అన్నిటికీ ఆయన డాక్యుమెంటరీలు నిర్మించారని చెప్పారు.

ఆయన కృషి లేకపోతే మనకి ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిసేవి కావని చెప్పారు. ఒక ఐస్‌ బర్గ్‌ మెల్ట్ అవుతున్న దృశ్యాలు చూస్తామని, అందుకు చాలా నెలలు కెమెరాలు పట్టుకుని వేచి చూడాలని చెప్పారు. అవి మళ్లీ సముద్రంలోకి వెళ్లడం చూడాలంటే మరికొన్ని నెలలు ఉండాలని అన్నారు.  తన జీవితకాలం మొత్తం ఆయన అడవిలోనే బతికాడని వివరించారు.  నెట్‌ప్లిక్స్‌లో అవర్‌ ప్లానెట్‌ పేరిట ఆయన చేసిన ఓ కార్యక్రమం‌ ఉందని, అది‌ చూస్తే ఆయన, ఆయన బృందం‌ ఎంతగా కష్టపడతారో తెలుస్తుందని తెలిపారు.

ఆయన గత 60 ఏళ్లుగా ఎన్విరాన్‌మెంట్‌ గురించి చదువుకుంటూనే ఉన్నారని పూరీ తెలిపారు. చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ఈ వయసులోనూ ఆయన అందుకుంటోన్న వేతనం వన్‌ మిలియన్‌ పౌండ్స్ అని పూరీ జగన్నాథ్ తెలిపారు. ఆయనకు ఆ వేతనం ఖర్చు పెట్టే అవసరం లేదని, ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ అడవిలోనే ఉంటాని తెలిపారు. తాను చనిపోయే లోపు ఒక్కసారైనా ఆయనని కలవాలని ఉందని పూరీ తెలిపారు.


More Telugu News