మంత్రి జయరాం భూకబ్జాకి పాల్పడి అడ్డంగా దొరికిపోయారు: బుద్ధా వెంకన్న
- ఇట్టినా భూములపై మంత్రి కన్ను పడిందన్న బుద్ధా
- మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- భూకబ్జాకు ఏపీ సర్కారు కొమ్ముకాస్తోందంటూ వ్యాఖ్యలు
వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం భూకబ్జాకి పాల్పడి అడ్డంగా దొరికిపోయారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. మంత్రి ల్యాండ్ స్కాంపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో బెంజ్ కారు కొట్టేసిన గుమ్మనూరు జయరాం కన్ను ఆలూరులోని 450 ఎకరాల భూమిపై పడిందని, ఇట్టినా కంపెనీకి చెందిన ఈ భూమిని మంత్రి గ్యాంగ్ తప్పుడు పత్రాలు సృష్టించి కొట్టేసిందని బుద్ధా ఆరోపించారు.
ఈ భూ కుంభకోణంపై ఇతర రాష్ట్రాల్లో కేసులు ఉన్నా, ఏపీలో మాత్రం ప్రభుత్వం ఈ భూకబ్జాకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. జగన్ గారూ, ఈ భూస్కాంలో అడ్డంగా దొరికిపోయిన భూబకాసురుడు మంత్రి గుమ్మనూరు జయరాంపై చర్యలు తీసుకోండి... లేకపోతే ఇందులో మీ వాటా ఎంతో చెప్పండి? అంటూ బుద్ధా నిలదీశారు.