హత్రాస్‌ ఘటనపై వైద్యుల నివేదిక .. అత్యాచారం జరిగిందంటూ ధ్రువీకరణ!

  • నివేదిక ఇచ్చిన జవహర్‌లాల్‌ నెహ్రూ వైద్య కాలేజీ 
  • అత్యాచారం జరిగినట్లు స్పష్టం
  • పోలీసులకు షాక్ ఇస్తోన్న నివేదిక
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఓ యువతి (20)పై చోటు చేసుకున్న హత్యాచార ఘటనపై పోలీసుల తీరు గురించి దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోన్న వేళ ఇటీవల పోలీసులు ప్రకటన చేస్తూ... ఆ యువతిపై అత్యాచారం జరగలేదని చెప్పుకొచ్చారు. అయితే, పోలీసులు చేసిన ప్రకటనకు భిన్నంగా మెడికో లీగల్‌ నివేదిక వచ్చింది.

ఆ యువతి మృతి గురించి అలీగఢ్‌ ముస్లిం వర్సిటీ పరిధిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ వైద్య కాలేజీ తాజాగా నివేదిక ఇచ్చింది. ఆమెపై అత్యాచారం జరిగినట్లు స్పష్టం చేసింది. కాగా, ఆమెపై అత్యాచారం జరగలేదని, ఆమె తీవ్ర గాయాల కారణంగానే మృతి చెందిందని యూపీ ఏడీజీ (శాంతి భద్రతలు) ప్రశాంత్‌ కుమార్‌ ఇటీవల పేర్కొంటూ ఈ మేరకు ఫోరెన్సిక్‌ నివేదిక ఇచ్చిందని అన్నారు. ఆ ప్రకటన కూడా చాలా ఆలస్యంగా చేశారు. అయితే, ఆ అమ్మాయిపై అత్యాచారం జరిగిందని వైద్యులు నివేదిక ఇవ్వడంతో పోలీసులకు షాక్ తగిలినట్లయింది.


More Telugu News