కరోనా పూర్తిగా తగ్గకముందే... మాస్క్ తీసేసిన డొనాల్డ్ ట్రంప్!
- శ్వేతసౌధానికి రాగానే మాస్క్ తొలగింపు
- త్వరలోనే ప్రచారానికి వెళ్లనున్నాను
- ట్విట్టర్ లో పేర్కొన్న అధ్యక్షుడు
నాలుగు రోజుల కరోనా ట్రీట్ మెంట్ తరువాత, వాల్టర్ రీడ్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి, వైట్ హౌస్ కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ వెంటనే మాస్క్ తీసేశారు. ట్రంప్ కు కరోనా నెగటివ్ వచ్చిందా? అన్న విషయమై స్పష్టత లేకపోవడంతో ట్రంప్ చర్యలు విమర్శలకు దారి తీస్తున్నాయి. మరో నెలలో అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కోవాల్సిన ట్రంప్, ప్రచారం షెడ్యూల్ ఇప్పటికే దాదాపు వారం రోజులు నిలిచిపోయింది. దీంతో సాధ్యమైనంత త్వరగా ప్రజల్లోకి వెళ్లి, తన ప్రచారాన్ని కొనసాగించాలని ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం.
కాగా, ఆసుపత్రి నుంచి ట్రంప్ వైట్ హౌస్ కు చేరుకుంటున్న దృశ్యాలను పలు అమెరికన్ టీవీ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. చాపర్ దిగే సమయంలో మాస్క్ తోనే ఉన్న ట్రంప్, నడుచుకుంటూ, శ్వేతసౌధంలోకి ప్రవేశించి, సౌత్ పోర్టికోలోని స్టాన్లీ బాల్కనీ నుంచి తన అభిమానులకు అభివాదం చేశారు. ఆ వెంటనే తన నోటికి, ముక్కుకు అడ్డుగా ఉన్న మాస్క్ ను తొలగించి వేశారు. టేకాఫ్ అవుతున్న మెరైన్ వన్ చాపర్ కు సెల్యూట్ చేశారు. ఆపై అతి త్వరలోనే తాను తిరిగి ప్రచారానికి రానున్నానని, ట్విట్టర్ వేదికగా ట్రంప్ ప్రకటించారు.
ట్రంప్ తన మాస్క్ ను తొలగిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఆయన మరికొన్ని రోజులు మాస్క్ ధరించి ఉంటేనే మంచిదని సోషల్ మీడియాలో సలహాలు, సూచనలు వస్తున్నాయి. ప్రస్తుతం తన ప్రత్యర్థి జో బైడెన్ కన్నా పాప్యులారిటీలో ట్రంప్ వెనుకబడ్డారని వివిధ సర్వేలు అంచనా వేస్తున్నాయి. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.