ప్రత్యేక హోదా ఇస్తే ఎన్డీయేలో చేరే విషయమై ఆలోచిస్తాం: చీఫ్ విప్  శ్రీకాంత్ రెడ్డి 

  • ఎన్డీయేలో చేరనుందని వార్తలు
  • విభజన హామీలను నెరవేరిస్తేనే
  • ఎన్డీయే నుంచి ఆహ్వానం లేదని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, నేడు ప్రధానితో భేటీ వెనుక భారీ అజెండా ఉందని, ఎన్డీయేలోకి రావాలంటూ బీజేపీ ఆహ్వానించిందని వస్తున్న వార్తలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేరుస్తామంటేనే ఎన్డీయేలో చేరే అంశంపై ఆలోచిస్తామని అన్నారు. ప్రస్తుతానికైతే, తమతో చేరాలని ఎన్డీయే నుంచి ఎటువంటి ఆహ్వానమూ లేదని, వైసీపీ సైతం ఆ ప్రతిపాదన చేయలేదని స్పష్టం చేశారు.

కాగా, ఫిబ్రవరి 12న మోదీతో జగన్ భేటీ అయిన తరవాత, కేవలం వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారానే వీరిద్దరూ మాట్లాడుకున్నారు. తాజాగా, ఈ ఉదయం 10.30 గంటలకు మరో భేటీ జరుగనుంది. ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటల నుంచి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో జగన్ పాల్గొననున్నారు.


More Telugu News