ప్రతి పది మందిలో ఒకరికి కరోనా సోకింది: కలకలం రేపుతున్న డబ్ల్యూహెచ్ఓ ప్రకటన

  • వాస్తవ గణాంకాలు 20 రెట్ల వరకూ అధికం
  • రానున్నది అత్యంత క్లిష్ట కాలం
  • 76 కోట్ల మందికి వైరస్ సోకిందన్న డబ్ల్యూహెచ్ఓ
ప్రపంచ జనాభాలో ఇప్పటికే పది శాతం మందికి కరోనా మహమ్మారి సోకిందని, ప్రతి పది మందిలో ఒకరు వ్యాధి బారిన పడ్డారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీ సేవల విభాగం అధిపతి డాక్టర్ మైఖేల్ రయాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా కేసులపై ఉన్న గణాంకాలతో పోలిస్తే, వాస్తవ గణాంకాలు 20 రెట్ల వరకూ అధికంగా ఉండవచ్చని, ఈ నేపథ్యంలో రానున్న కాలం ప్రపంచానికి అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదురు చేయనుందని ఆయన అంచనా వేశారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనాపై చర్చించేందుకు 34 సభ్య దేశాల ప్రతినిధుల ఎగ్జిక్యూటివ్ బోర్డుతో రయాన్ మాట్లాడారు. ప్రపంచంలోని సుమారు 76 కోట్ల మంది ఇప్పటికే వైరస్ బారిన పడ్డారన్న ఆయన, తమ అంచనాలు, జాన్సన్ హాకిన్స్ యూనివర్శిటీ అంచనాలు సరిపోతున్నాయని అన్నారు. కాగా, ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు మూడున్నర కోట్ల మందికి వైరస్ సోకిందన్న సంగతి తెలిసిందే. వీటిలో సగానికి పైగా కేసులు అమెరికా, ఇండియా, బ్రెజిల్, రష్యాల్లోనే నమోదయ్యాయి.


More Telugu News