పదేపదే క్రీజు దాటిన బట్లర్.. వార్నింగ్ తో వదిలేసిన అశ్విన్!

  • మన్కడింగ్ చేసేందుకు అశ్విన్ కు మరో అవకాశం
  • ఫించ్ ని హెచ్చరించి వదిలేసిన వైనం
  • నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ లో ఘటన
గత సంవత్సరం ఐపీఎల్ లో అశ్విన్ తెరపైకి తెచ్చిన వివాదం గుర్తుందా? అదే... మన్కడింగ్... రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్, పదేపదే క్రీజు దాటి బయటకు వస్తుంటే, తన చేతి నుంచి బాల్ ను రిలీజ్ చేయకుండా ఔట్ చేసిన అశ్విన్, ఆపై క్రీడా స్ఫూర్తిని మరిచాడని విమర్శల పాలయ్యాడు కూడా. సరిగ్గా అటువంటి ఘటనే, నిన్నరాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లోనూ జరిగింది. అయితే, ఈ దఫా అశ్విన్ కేవలం వార్నింగ్ తో సరిపెట్టాడు.

అశ్విన్ బౌలింగ్ లో నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న ఆరోన్ ఫించ్, క్రీజ్ దాటి చాలా దూరం వెళ్లిపోయాడు. అశ్విన్, తన బౌలింగ్ ను ఆపి వార్నింగ్ ఇచ్చాడే తప్ప, ఔట్ చేయాలని చూడలేదు. ఆపై అంపైర్ వైపు చూస్తూ, చిరునవ్వులు చిందిస్తూ, మరో బాల్ ను వేసేందుకు వెళ్లిపోయాడు. ఆపై మైదానంలోని కెమెరాలన్నీ డగౌట్ లో ఉన్న రికీ పాంటింగ్ వైపు తిరిగాయి. అందుకు కూడా ఓ కారణం ఉందండోయ్...

గత సంవత్సరం అశ్విన్ మన్కడింగ్ కు పాల్పడిన వేళ, రికీ పాంటింగ్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, ఓ ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తే, సరిపోతుందని, ఈ మేరకు కొత్త నిబంధన తేవాలని కూడా డిమాండ్ చేశాడు. ఆ ఘటన ప్రతి ఒక్కరికీ గుర్తుంది. అందుకే కెమెరాలన్నీ పాంటింగ్ ముఖంవైపు వెళ్లాయి. ఇదే సమయంలో కామెంట్రీ బాక్స్ నుంచి కూడా జోకులు వినిపించాయి. పాంటింగ్ మాత్రం తన ఫేస్ లో ఏ ఎక్స్ ప్రెషన్ కనిపించనీయకుండా, ఊపిరి బిగబట్టుకుని, లోలోపలే నవ్వుకుంటూ కనిపించాడు.


More Telugu News