ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు!

  • స్థిరంగా ఉన్న అల్పపీడనం
  • ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు
  • హెచ్చరించిన అమరావతి వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ లో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీరంలో నెలకొన్న అల్పపీడనం స్థిరంగా ఉందని, దీనికి అనుబంధంగా దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి ఉత్తర మహారాష్ట్ర వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడి వుందని, దీని ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. 9వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో, వచ్చే నాలుగు రోజులూ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.


More Telugu News