వల్లభనేని వంశీపై తీవ్ర విమర్శలు చేసిన యార్లగడ్డ వెంట్రావు
- గన్నవరం వైసీపీలో రచ్చకెక్కుతున్న విభేదాలు
- వంశీ దొడ్డిదారిన ఇంటికి వచ్చారన్న యార్లగడ్డ
- అసలైన పార్టీ కార్యకర్తలు అవమానానికి గురవుతున్నారని వ్యాఖ్య
గన్నవరం నియోజకవర్గం వైసీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరోనేత యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తరపును గెలిచి, వైసీపీలోకి దొడ్డి దారిన వచ్చి, గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీలోకి వంశీ వచ్చాక నియోజకవర్గంలో అడుగుపెట్టకూడదని అనుకున్నానని చెప్పారు. కానీ అసలైన పార్టీ కార్యకర్తలు అవమానాలకు గురవుతున్నారని, కేసులపాలవుతున్నారని... ఇవన్నీ చూడలేకే మళ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టానని తెలిపారు.
మరోవైపు తన జన్మదిన వేడుకలను నిర్వహించకుండా పోలీసులు ఆంక్షలు విధించడంపై యార్లగడ్డ మండిపడ్డారు. నున్నలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీ కాన్వాయ్ తో ఆయన వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 144 అమల్లో ఉందని, ఇంతమంది రావడానికి వీల్లేదని చెప్పారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంశీపై విమర్శలు గుప్పించారు.