'ఆర్ఆర్ఆర్' షూటింగ్ మొదలెట్టిన రాజమౌళి!
- లాక్ డౌన్ కారణంగా షూటింగుకి బ్రేక్
- రామోజీ ఫిలిం సిటీలో నేడు ప్రారంభం
- ఎన్టీఆర్, రాహుల్ రామకృష్ణలపై చిత్రీకరణ
- నిర్మాతల నుంచి రేపు రానున్న అప్ డేట్
'బాహుబలి' సీరీస్ తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ప్రముఖ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ వల్ల ఆరు నెలల నుంచీ ఆగిపోయిన సంగతి విదితమే.
ఈ క్రమంలో నేటి నుంచి ఈ చిత్రం షూటింగును హైదరాబాదు సమీపంలోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి రక్షణ చర్యలు తీసుకుంటూ ఈ చిత్రం షూటింగును ప్రారంభించినట్టు సమాచారం. ముందుగా ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ఎన్టీఆర్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే హాస్య నటుడు రాహుల్ రామకృష్ణ కూడా ఈ షూటింగులో పాల్గొంటున్నట్టు చెబుతున్నారు. ఇందులో ఎన్టీఆర్ కి రాహుల్ స్నేహితుడిగా నటిస్తున్నాడట. దాంతో వీరిపై ఈ రోజు కొన్ని దృశ్యాలను చిత్రీకరించారు.
ఇక ఈ విజయదశమికి 'ఆర్ఆర్ఆర్' నుంచి కానుకగా ఎన్టీఆర్ కి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసే యోచనలో చిత్రం యూనిట్ వుంది. అందుకు తగ్గా షాట్స్ ను కూడా ముందుగా షూట్ చేస్తున్నారట. ఇదిలావుంచితే, రేపు (మంగళవారం) ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్ డేట్ ను ఇవ్వనున్నట్టు చిత్రం యూనిట్ ఈ రోజు ప్రకటించింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ 'ఆర్ఆర్ఆర్'ను పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు.