కేన్సర్‌కు చికిత్స నేపథ్యంలో... సినీనటుడు సంజయ్‌ దత్ ఫొటో చూసి షాక్ అవుతోన్న నెటిజన్లు

  • సంజయ్‌ దత్‌తో ఓ అభిమాని ఫొటో
  • సంజయ్‌ దత్‌ ముఖంలో తేడాలు
  • సన్నబడిపోయిన సంజయ్‌
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ కేన్సర్‌కు చికిత్స తీసుకుంటోన్న విషయం తెలిసిందే. సంజయ్‌కి లంగ్‌ క్యాన్సర్‌ అడ్వాన్స్ డ్ స్టేజీలో ఉండడంతో ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంజయ్‌ దత్‌ భార్య మాన్యతా దత్, పిల్లలు దుబాయ్‌లో ఉండడంతో ఇటీవల ఆయన కూడా దుబాయ్‌కి వెళ్లి వచ్చారు.

అయితే, ఎయిర్‌పోర్టులో ఓ అభిమాని ఆయనతో ఫొటో తీసుకుంది. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సంజయ్‌ని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇందులో సంజయ్‌ దత్‌ ముఖంలో తేడాలు కనపడ్డాయి. ఆయన క‌ళ్లు లోప‌లికి పోయి ఉన్నాయి. మనిషి కూడా బాగా చిక్కి, నీరసంగా కనిపిస్తున్నారు.

దీంతో ఆయన లుక్‌ అభిమానుల్ని ఆందోళన‌కు గురిచేస్తోంది. సంజయ్‌ దత్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోపక్క, ఆయన చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఆయనకు కేన్సర్ ఉందని తేలడంతో వాటిలో ఆయన నటించే విషయంపై సందిగ్ధత నెలకొంది. కన్నడ సినిమా కేజీఎఫ్‌-2లో ఆయన కీలకమైన అధీరా పాత్రలో నటించాల్సి ఉంది.    




More Telugu News