కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఇంటిపై సీబీఐ ఆకస్మిక దాడి
- కర్ణాటక, ముంబైలలోని ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు
- మొత్తం 14 చోట్ల దాడులు చేసిన సీబీఐ అధికారులు
- విరుచుకుపడుతున్న కాంగ్రెస్
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఇళ్లు, కార్యాలయాలపై ఈ ఉదయం సీబీఐ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఆదాయపు పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివకుమార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతంలో మూడు కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో శివకుమార్‌తోపాటు ఆయన సోదరుడు డీకే సురేశ్‌కు చెందిన కర్ణాటక, ముంబైలలోని ఆయన కార్యాలయాల్లో ఈ ఉదయం అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 14 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు.
శివకుమార్ ఇళ్లపై సీబీఐ దాడుల విషయం తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఉప ఎన్నికల ముందు తమను దెబ్బకొట్టేందుకు బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మోదీ, యడియూరప్ప ద్వయం కావాలనే కుట్రతో ఈ దాడులు చేయించిందని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు.