మరో ఆరు నెలల్లో ఆక్స్‌ఫర్డ్ టీకా.. తొలుత 65 ఏళ్లు పైబడిన వారికే వ్యాక్సినేషన్
- ఆక్స్‌ఫర్డ్ టీకాకు క్రిస్మస్ నాటికి అనుమతి
- ఆ వెంటనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం
- బ్రిటన్ మీడియా కథనం
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా మరో ఆరు నెలల్లోపు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టీకా అందుబాటులోకి రాగానే వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నారు. తొలుత 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, ఆ తర్వాత అత్యంత ముప్పు కలిగిన వారికి, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న యువకులకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపినట్టు బ్రిటన్ మీడియా పేర్కొంది.
ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి, యువతకు టీకా ఇవ్వనున్నట్టు, మొత్తానికి ఆరు నెలల్లోపే వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నట్టు తెలిపింది. ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయని, క్రిస్మస్ నాటికి అనుమతులు వచ్చే అవకాశం ఉందని వివరించింది. అనుమతులు రాగానే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అవుతుందని వివరించింది.