శంషాబాద్ విమానాశ్రయంలో 8 కిలోల బంగారం పట్టివేత
- రూ. 6 కోట్లకు పైగా విలువైన బంగారం, వజ్రాలతో పెట్టె
- ముంబై, జైపూర్‌లకు తరలింపు
- ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టేందుకు అడ్డదారిలో తరలింపు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి రహస్యంగా తరలిస్తున్న దాదాపు 8 కిలోల బంగారం, ఇతర విలువైన వస్తువులున్న బాక్స్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కార్గో విమానంలో ఈ నెల 3న జైపూర్, ముంబైలకు తరలిస్తున్న పెట్టెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 21 కిలోల బరువున్న ఈ బాక్స్‌ను నిన్న విప్పి చూశారు.
అందులో 2.37 కిలోల బంగారు బిస్కెట్లు, 5.63 కిలోల బంగారు ఆభరణాలు, వజ్రాలు, స్టెయిన్‌లెస్ స్టీల్ గడియారాలు, ప్లాటినం టాప్స్‌తోపాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నట్టు తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 6,62,46,387 ఉంటుందని అంచనా వేశారు. ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టేందుకు అడ్డదారిలో వీటిని తరలిస్తున్నట్టు గుర్తించారు. బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నప్పటికీ అది ఎవరిదన్న వివరాలు తెలియరాలేదని, దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.