చైనా సైనికుల్లో పాక్ ఎన్ఎస్జీ కమాండోలు... ఈ వీడియోనే సాక్ష్యం!

  • సోషల్ మీడియాలో చైనా సైనికుల వీడియో
  • వారితో పాటు కనిపిస్తున్న ఓ గడ్డమున్న వ్యక్తి
  • ట్రయినింగ్ కోసం పాక్ పంపిందంటున్న భారత నిపుణులు
సరిహద్దుల్లో భారత సైన్యాన్ని నిలువరించేందుకు చైనా బలగాలకు పాక్ కమాండోలు శిక్షణ ఇస్తున్నారా? ఈ చిత్రాన్ని చూస్తే ఔననే అనిపిస్తుంది. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనా దళాలు తమ జాతీయ గీతాన్ని పాడుతున్న వీడియోను ఓ జర్నలిస్ట్, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతవరకూ ఓకే... అందులో చైనా సైనికులతో పాటు పొడవుగా గడ్డంతో ఉన్న ఓ వ్యక్తి కనిపిస్తుండటమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

చైనా పోలికలు ఎంతమాత్రమూ లేని ఈ వ్యక్తి ఎవరన్న విషయమై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే సాగుతోంది. ఈ వీడియోను పరిశీలించిన భారత సైనిక నిపుణులు, అతను పాక్ కు చెందిన ఎన్ఎస్జీ కమాండో అయ్యుంటాడని అంచనా వేస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో యుద్ధం ఎలా చేయాలి, ప్రణాళికలు ఎలా ఉండాలన్న విషయమై చైనా సైనికులకు విక్షణ ఇచ్చేందుకు వచ్చుంటాడని అంటున్నారు.


More Telugu News