కరోనా బారినపడిన వారిలో లక్షణాలు లేకపోవడానికి కారణం అదేనట: శాస్త్రవేత్తలు
- కరోనా రోగుల్లో నొప్పి అణచివేతకు గురవుతుంది
- అరిజోనా యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
- నొప్పిని తగ్గించే వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్
కరోనా మహమ్మారి బారినపడిన 50 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు బయటపడపోవడానికి వెనకున్న కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వైరస్ కారణంగా నొప్పి నుంచి ఉపశమనం లభించడమే ఇందుకు కారణం కావొచ్చని అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. వైరస్ సోకిన తర్వాత ప్రారంభ దశలో బాధితుడిలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడానికి కారణం అతడిలోని నొప్పి అణచివేతకు గురికావడమేనని శాస్త్రవేత్త రాజేశ్ ఖన్నా తెలిపారు.
వైరస్ కారణంగా నొప్పి రూపంలో తలెత్తే లక్షణాన్ని కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్ తగ్గిస్తుండవచ్చని పేర్కొన్నారు. శరీరంలోని నొప్పి సంకేతాలకు సంబంధించిన మార్గాలను ఇది నిశ్శబ్దం చేసి నొప్పి తెలియకుండా చేస్తుందని పేర్కొన్నారు. ఈ కారణంగానే ఇన్ఫెక్షన్ బారినపడిన వారిలో 40 శాతం కేసుల్లో వ్యాధి లక్షణాలు కనిపించకపోవడానికి ఇదే కారణమని పేర్కొన్నారు.