కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కు గుండె ఆపరేషన్
- గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో పాశ్వాన్
- శనివారం రాత్రి అత్యవసరంగా శస్త్రచికిత్స
- ఆరా తీసిన మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్
సీనియర్ నేత, కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కు వైద్యులు గుండె ఆపరేషన్ నిర్వహించారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో శనివారం శస్త్రచికిత్స జరిగినట్టు ఆయన కుమారుడు, లోక్‌జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. తన తండ్రి గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో ఉన్నారని, శనివారం సాయంత్రం అనుకోకుండా కొన్ని సమస్యలు తలెత్తడంతో రాత్రి పొద్దుపోయాక వైద్యులు ఆయన గుండెకు శస్త్రచికిత్స చేసినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అవసరమైతే మరోమారు ఆపరేషన్ చేస్తారని పేర్కొన్నారు. కష్ట సమయంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి చిరాగ్ పాశ్వాన్ ధన్యవాదాలు తెలిపారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపకాలపై ఈ నెల 3న బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేతో ఎల్‌జేపీ సమావేశం కావాల్సి ఉంది. అయితే, పాశ్వాన్‌కు శస్త్రచికిత్స కారణంగా సమావేశం వాయిదా పడింది. రాం విలాస్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు ఆరాతీశారు.