యుద్ధాల్లో రాజకీయనేతలు బాగానే ఉంటారు... చనిపోయేది సైనికులు, సామాన్యులే: నాగబాబు
- అన్నే ఫ్రాంక్ వ్యాఖ్యలను ఉదహరించిన నాగబాబు
- యుద్ధాలు హృదయం లేని వారి వల్లే ఏర్పడతాయని వెల్లడి
- ప్రజల దృష్టిని మళ్లించడానికే యుద్ధాలని వ్యాఖ్యలు
రెండో ప్రపంచ యుద్ధంలో యూదులు అనుభవించిన బాధలను డైరీలో పొందుపరిచిన అన్నే ఫ్రాంక్ ఉదహరించిన కొన్ని వ్యాఖ్యలను సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ట్విట్టర్ లో పంచుకున్నారు. యుద్ధాలతో రాజకీయ నాయకులు బాగానే ఉంటారని, ఇబ్బందులు పడేది, చనిపోయేది సైనికులు, అమాయకులైన సామాన్యులు మాత్రమేనని పేర్కొన్నారు. యుద్ధాలు హృదయం లేని మేధావులు, రాజకీయ వేత్తల వల్ల సంభవిస్తాయని వివరించారు. వాళ్లు అధికారంలో కొనసాగడానికి, ప్రజల దృష్టిని అసలైన సమస్యల నుంచి మళ్లించడానికి యుద్ధాలను చేయిస్తుంటారని తెలిపారు.
జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో జన్మించిన అన్నే ఫ్రాంక్ జీవితకాలం కేవలం 15 సంవత్సరాలే అయినా, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కుటుంబంతో పాటు నాజీల చెరలో మగ్గిపోయింది. ఆ సమయంలోనే తమ అనుభవాలను ఆమె 'ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గాళ్' పేరిట డైరీలో రాసింది. ఈ డైరీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అన్నే ఫ్రాంక్ తన పదిహేనేళ్ల వయసులో టైఫస్ జ్వరంతో మరణించింది. నాడు యూదులు అనుభవించిన నరకానికి ఆమె నిదర్శనంగా నిలిచింది.