హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలో టీఆర్ఎస్ నేతల బాహాబాహీ

  • రామ్ కోఠిలో ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం
  • వేదికపైకి పిలవలేదని ఆర్వీ మహేందర్ అలక
  • సమావేశంలో తోపులాట
  • కార్యకర్తలకు సర్దిచెప్పిన మహమూద్ అలీ
హైదరాబాదు గోషామహల్ నియోజకవర్గ టీఆర్ఎస్ సమావేశం రసాభాస అయింది. హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలోనే స్థానిక టీఆర్ఎస్ నేతలు బాహాబాహీకి దిగారు. తనను వేదిక పైకి ఎందుకు పిలవలేదంటూ ఆర్వీ మహేందర్ నిలదీయడంతో వివాదం మొదలైంది. దాంతో ఇతర కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ ఘర్షణ ఏర్పడింది. సభ కాస్తా రణరంగంగా మారింది. ఒకరినొకరు తోసుకుంటూ ఆందోళనకర వాతావరణం సృష్టించారు.

ఈ క్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ కార్యకర్తలకు సర్దిచెప్పడంతో పరిస్థితి కొద్దిమేర సద్దుమణిగింది. ఆపై మహేందర్ ను వేదికపైకి రావాలని మైక్ లో అనౌన్స్ చేశారు. రామ్ కోఠిలోని రూబీ గార్డెన్స్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం సందర్భంగా ఈ రభస జరిగింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీ వెంటే ఉన్న తమకు గుర్తింపు లేదని ఆర్వీ మహేందర్ ఈ సందర్భంగా వాపోయారు.



More Telugu News