ముంబయి 208/5... సన్ రైజర్స్ ఏంచేస్తారో?

  • షార్జాలో సన్ రైజర్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబయి
  • రాణించిన డికాక్, కృనాల్ మెరుపులు
పరుగుల వరదకు వేదికగా నిలుస్తున్న షార్జా క్రికెట్ స్టేడియంలో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 67 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

సూర్యకుమార్ యాదవ్ 27, ఇషాన్ కిషన్ 31, హార్దిక్ పాండ్య 28, పొలార్డ్ 25, కృనాల్ 4 బంతుల్లో 20 పరుగులు సాధించారు. సిద్ధార్థ్ కౌల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కృనాల్ ఏకంగా రెండు సిక్సులు, రెండు ఫోర్లు బాదడంతో ముంబయి స్కోరు 200 దాటింది. అంతకుముందు ఆరంభంలో కెప్టెన్ రోహిత్ శర్మ (6) నిరాశపరిచాడు.

కాగా, బ్యాటింగ్ కు స్వర్గధామం వంటి ఈ స్టేడియంలో ఇప్పటివరకు ఆడిన ఐపీఎల్ మ్యాచ్ లో భారీస్కోర్లు నమోదయ్యాయి. ఛేజింగ్ చేసిన జట్లు కూడా రెండొందల పరుగుల మార్కు దాటించాయి. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ ఎలా స్పందిస్తారో చూడాలి!


More Telugu News