వృద్ధురాలి మృతదేహం వద్దకు వచ్చిన వానరాలు.. వింతను చూసేందుకు వచ్చిన గ్రామస్థులు

  • ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లా బెల్హాలో ఘటన
  • బంధువులను ఓదార్చిన కోతులు
  • దేవుడి చర్యల్లో భాగమే ఈ వింత అంటోన్న గ్రామస్థులు 
చనిపోయిన వృద్ధులను మనుషులే పట్టించుకోని ఘటనలను చూస్తున్నాం. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లా బెల్హాలో ఓ వృద్ధురాలు చనిపోతే ఆమె అంత్యక్రియలకు కోతులు వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఆ వృద్ధురాలి మృత దేహం ఓ మంచంపై ఉండగా దాని వద్దకు వచ్చిన కోతులు అక్కడ కూర్చుని ఏడుస్తోన్న వారిని సైతం ఓదార్చాయి.

ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో ఓ  కొండముచ్చు మంచంపై కూర్చుని కొంత సమయం అక్కడే ఉంది. ఈ ఘటన గురించి ఊరంతా చర్చించుకున్నారు. కొద్దిసేపటికే గ్రామస్థులు పెద్ద ఎత్తున వచ్చి ఈ వింతను చూసి వెళ్లారు. తమ గ్రామంలో గతంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదని, ఆ దేవుడి చర్యల్లో భాగమే ఈ వింత అని వారు అన్నారు.  మృతదేహం వద్ద అవి సుమారు రెండు గంటలపాటు కూర్చొని వెళ్లిపోయాయి.

         


More Telugu News