అందుకే పట్టాభి కారుపై దాడి చేశారు: కళా వెంకట్రావు
- వైసీపీ నేతలే దాడి చేయించారు
- అక్రమాలను చెబుతున్నారన్న ఆగ్రహంతోనే దాడి
- గౌతమ్ సవాంగ్ ఎందుకు స్పందించడం లేదు
- తప్పుడు కేసులతో టీడీపీ నాయకులను వేధిస్తున్నారు
టీడీపీ నేత పట్టాభి రామ్ కారుపై దాడి జరగడం పట్ల ఆ పార్టీ నేత కళా వెంకట్రావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభిరాం కారుపై వైసీపీ నేతలే దాడి చేయించారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతల అక్రమాలను చెబుతున్నారన్న ఆగ్రహంతోనే పట్టాభిరాం కారుపై దాడి చేశారని అన్నారు.
రాష్ట్రంలో వైసీపీ నేతల దాడులు పెరిగిపోతున్నప్పటికీ గౌతమ్ సవాంగ్ ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. ఆయన పనిచేస్తోంది ఏపీ ప్రజల కోసమా లేక సీఎం వైఎస్ జగన్ కోసమా? అని ఆయన అడిగారు. ప్రభుత్వ పెద్దలు చేస్తోన్న అన్యాయాలపై ప్రశ్నించే వారిపై దాడులు సరికాదని ఆయన అన్నారు.
జగన్ పాలన హిట్లర్, గడాఫీల వంటి నేతల కంటే దారుణంగా తయారైందని ఆయన చెప్పారు. జగన్ ఏపీలో పాలన నాజీలను మించిపోతోందని ఆయన చెప్పారు. ప్రతిరోజు దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అవినీతిని, అరాచకాలను ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేగాక, తప్పుడు కేసులతో టీడీపీ నాయకులను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.