అన్నను పక్కన కూర్చోబెట్టుకుని స్వయంగా కారు నడిపిన ప్రియాంకా గాంధీ... వీడియో ఇదిగో!
- టయోటా ఇన్నోవా వాహనంలో ప్రయాణం
- 200 కిలోమీటర్లు ప్రయాణించిన కాంగ్రెస్ నేతలు
- అన్ని వాహనాలనూ ఆపివేసిన రెండు రాష్ట్రాల పోలీసులు
తన సోదరుడు రాహుల్ గాంధీని పక్కన కూర్చోబెట్టుకుని ప్రియాంకా గాంధీ ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్)ను నడుపుకుంటూ, న్యూఢిల్లీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని హాత్రాస్ కు వెళ్లారు. ఈ విషయం శనివారం మధ్యాహ్నమే అందరికీ తెలిసినా, అందుకు సంబంధించిన వీడియో, ఆ తరువాత వైరల్ అయింది. హాత్రాస్ లో హత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబాన్ని వీరు పరామర్శించేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
టయోటా ఇన్నోవా వాహనాన్ని వీరు తమ ప్రయాణానికి ఎంచుకున్నారు. ఎలాగైనా హాత్రాస్ కు వెళతామని వీరిద్దరూ ముందే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆపై ఢిల్లీ నోయిడా డైరెక్ట్ (డీఎన్డీ) ఫ్లయ్ వే పైకి ఎక్కిన వీరి వాహనం బయలుదేరిన తరువాత, ఢిల్లీ, యూపీ పోలీసులు, ఇతర ప్రాంతాల నుంచి డీఎన్డీపైకి దారితీసే అన్ని రహదారులనూ బారికేడ్లతో మూసేశారు.
కాంగ్రెస్ నేతలతో పాటు మరెంతో మంది పార్టీ నేతలు, కార్యకర్తలు వారిని అనుసరించారు. వీరందరినీ యూపీ సరిహద్దుల వద్ద ఆపివేయగా, కాంగ్రెస్ టాప్ లీడర్లతో పాటు, మరో ముగ్గురు మాత్రం తమ గమ్యాన్ని చేరుకున్నారు. రాహుల్ పక్కన కూర్చోగా, ప్రియాంక వాహనాన్ని నడుపుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.