ప్రతిభావంతురాలైన విద్యార్థినికి ప్రకాశ్ రాజ్ ఆర్థిక సాయం
- తిగిరిపల్లి సిరి చందన అనే విద్యార్థినికి సాయం
- విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకుంటున్న విద్యార్థిని
- ఆర్థిక ఇబ్బందులతో సతమతం
- ప్రకాశ్ రాజ్ దృష్టికి వచ్చిన వైనం
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఎంతో సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. అంతేకాదు, దాతృత్వంలోనూ ముందుంటారు. తాజాగా ఓ ప్రతిభావంతురాలైన విద్యార్థినికి ఆర్థిక సాయం చేసి తన పెద్ద మనసు చాటుకున్నారు.
తిగిరిపల్లి సిరి చందన అనే విద్యార్థిని పోస్టు గ్రాడ్యుయేషన్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉండగా, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం ప్రకాశ్ రాజ్ దృష్టికి వచ్చింది. దాంతో ఆయన సిరి చందన విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చారు. సిరి చందనను ఆర్థికంగా ఆదుకుని ఆమె కుటుంబంలో సంతోషం నింపారు.
తిగిరిపల్లి సిరి చందన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా. ఆమె 9 ఏళ్ల వయసులోనే తండ్రి కోల్పోయింది. అయితే తల్లి ఎంతో కష్టపడి పెంచి పెద్దచేసింది. కంప్యూటర్స్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసేందుకు ఆమెకు యూకే యూనివర్శిటీలో సీటు వచ్చింది. ఇప్పుడు ప్రకాశ్ రాజ్ చలవతో ఆమె తన పీజీ కోసం విదేశాలకు వెళుతోంది.
సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించే ప్రకాశ్ రాజ్ ఇప్పటికే కొండారెడ్డిపల్లె అనే గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. తన ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా అనేక సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు.