బాండ్ సినిమా మళ్లీ వాయిదా.. విడుదల ఇక వచ్చే ఏడాదే!
- జేమ్స్ బాండ్ సీరీస్ లో 25వ చిత్రం
- డేనియల్ క్రేజ్ హీరోగా 'నో టైమ్ టు డై'
- వైరస్ దాడి నుంచి ప్రజలను రక్షించే కథ
- 2021 ఏప్రిల్ 2కి విడుదల వాయిదా
తరాలు మారినా జేమ్స్ బాండ్ చిత్రాలను వీక్షించడంలో ప్రేక్షకుల అభిరుచిలో మాత్రం మార్పురాలేదు. కొత్తగా బాండ్ సినిమా వస్తోందంటే ఆంగ్ల చిత్రాలను అభిమానించే ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అలాంటి బాండ్ చిత్రాల సీరీస్ లో ఇప్పటివరకు ఇరవై నాలుగు సినిమాలు వచ్చాయి. 25వ చిత్రంగా రూపొందుతున్నదే 'నో టైమ్ టు డై'!
డేనియల్ క్రేజ్ జేమ్స్ బాండ్ పాత్రలో నటించిన ఈ చిత్రకథ ప్రస్తుత కరోనా పరిస్థితులకు అద్దం పడుతుంది. మానవాళి మీద ఒక భయంకర వైరస్ దాడి చేయడం.. దాని దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోవడం.. ఆ వైరస్ బారి నుంచి ప్రజలను తనదైన శైలిలో జేమ్స్ బాండ్ రక్షించడం.. వంటి ఘటనలతో ఆసక్తికరంగా ఈ సినిమా రూపొందింది.
ఇక వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కావాలి. అయితే, కరోనా విలయతాండవం నేపథ్యంలో నవంబర్ కి వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం విడుదల ఇప్పుడు మళ్లీ వాయిదా పడింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 2న దీనిని విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ఇయాన్ ప్రొడక్షన్స్ ప్రకటించింది.
క్యారీ జోజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 250 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించారు. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని ఆంగ్ల చిత్రంతో పాటు ఒకేసారి విడుదల చేస్తారు.