నయీం కేసులో పోలీసు అధికారులందరికీ క్లీన్ చిట్

  • 25 మంది అధికారులకు క్లీన్ చిట్
  • సాక్ష్యాలు దొరకలేదన్న సిట్
  • ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖకు సిట్ చీఫ్ సమాధానం
గ్యాంగ్ స్టర్ నయీం కేసులో సంచలన విషయం వెల్లడైంది. నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 25 మంది పోలీసులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ 25 మంది అధికారులపై బెదిరింపులు, ల్యాండ్ సెటిల్మెంటుల ఆరోపణలు ఉన్నాయి.

 అయితే ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో వీరందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలతో పాటు హెడ్ కానిస్టేబుల్ వరకు ఉన్నారు.  ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాసిన లేఖకు బదులుగా సిట్ చీఫ్ నాగిరెడ్డి ఈ మేరకు సమాధానమిచ్చారు. మరోవైపు నయీం కేసులో 175కి పైగా ఛార్జిషీట్లు ఉన్నాయి. 130కి పైగా కేసుల్లో ఎనిమిది మంది రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి.


More Telugu News