ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘనపై కమిటీతో విచారణ జరిపించాలి: వర్ల రామయ్య లేఖ

  • ఎస్సీలపై వరుస దాడులు 
  • అరికట్టడంలో రాష్ట్ర సర్కారు విఫలం
  • శిరోముండనం కేసులో నిందితులను అరెస్టు చేయలేదు
  • రూల్‌ ఆఫ్ లా అమలు కావడంలేదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని తెలుపుతూ జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఆయన లేఖ రాశారు. ఏపీలో ఇటువంటి ఘటనపై ప్రత్యేక కమిటీతో దర్యాప్తు జరిపించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలపై వరుస దాడులు జరుగుతున్నప్పటికీ, వాటిని అరికట్టడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందని ఆయన విమర్శలు గుప్పించారు.

ఎస్సీ కుటుంబంపై సజీవదహనానికి ప్రయత్నించినా సర్కారు స్పందించలేదని ఆయన చెప్పారు. కొన్ని రోజుల క్రితం జరిగిన శిరోముండనం కేసులో నిందితులను అరెస్టు చేయలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రూల్‌ ఆఫ్ లా అమలు కావడంలేదని హైకోర్టు కూడా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే డీజీపీని హైకోర్టుకి పిలిపించి హెచ్చరించినా సర్కారు పాలనలో మార్పు రాలేదని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ద్వారా సంక్రమించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను  ఆంధ్రప్రదేశ్‌లో హరిస్తున్నారని ఆయన అన్నారు.


More Telugu News