జూబ్లీహిల్స్‌లో రాత్రి 12 సార్లు కంపించిన భూమి.. భూమిలోంచి భారీ శబ్దాలు
- రాత్రి 8.15 గంటలకు మొదలైన ప్రకంపనలు
- భయంతో వణికిపోయి ఇళ్ల నుంచి బయటకు వచ్చేసిన జనం
- బోరబండలో భూమి నుంచి భారీ శబ్దాలు
జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో గత రాత్రి వరుస భూ ప్రకంపనలు సంభవించాయి. దీనికి తోడు భూమిలోంచి భారీ శబ్దాలు వెలువడడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. గత రాత్రి 8.15 గంటల నుంచి 9 గంటల మధ్య 12 సార్లు భూమి కంపించింది.
జూబ్లీహిల్స్, రహమత్‌నగర్, బోరబండ సైట్-3, ఎస్పీఆర్ హిల్స్, అల్లాపూర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. ఒక్కోసారి 5 నుంచి 10 సెకన్లపాటు కంపించినట్టు స్థానికులు తెలిపారు. భూ ప్రకంపనల భయంతో వణికిపోయిన జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. ప్రకంపనలు ఆగిన తర్వాత తిరిగి లోపలికి వెళ్లారు.
అయితే, బోరబండలో రాత్రి 11.25 గంటలకు మరోమారు భూమి పెద్ద శబ్దంతో కంపించింది. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు భారీ శబ్దాలు వచ్చిన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. 2017లో సరిగ్గా ఇదే నెలలో ఒకసారి ఇలాగే భారీ శబ్దాలు వచ్చినట్టు స్థానికులు తెలిపారు.