ట్రంప్ దంపతులు త్వరగా కోలుకోవాలంటూ మోదీ సహా ప్రపంచ నేతల ఆకాంక్ష
- ట్రంప్, మెలానియాలకు కరోనా పాజిటివ్
- సందేశం పంపిన ప్రధాని మోదీ
- ఇరాన్ మీడియాలో ట్రంప్ పై సెటైర్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ కరోనా బారినపడగా, వారిద్దరూ త్వరగా కోలుకోవాలంటూ ప్రపంచ దేశాధినేతల నుంచి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ కు కరోనా సోకిందని తెలియగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించారు. మిత్రుడు ట్రంప్, ఆయన భార్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు సందేశం పంపారు.
ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రి లిటిల్ ప్రౌడ్ స్పందిస్తూ, ట్రంప్ దంపతులు త్వరగా ఆరోగ్యం సంతరించుకోవాలని తెలిపారు. వైరస్ వ్యాప్తికి ఎవరూ అతీతులు కారన్న విషయం దీనిద్వారా రుజువైందని వ్యాఖ్యానించారు. జాగ్రత్త చర్యలు తీసుకున్నా వైరస్ సోకే అవకాశాలున్నట్టు అర్థమవుతోందని పేర్కొన్నారు. ఇక, ఇరాన్ మీడియాలో ట్రంప్ కు కరోనా సోకిందన్న విషయాన్ని వ్యంగ్యభరితంగా ప్రస్తావిస్తున్నారు. చైనా, జపాన్ ప్రజల్లో కొందరు ట్రంప్ పై సెటైర్లు వేస్తున్నారు.