చప్పట్లు కొడుతూ వాలంటీర్లకు సంఘీభావం తెలిపిన సీఎం జగన్
- వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తి
- 7 గంటలకు చప్పట్లు కొడుతూ అభినందించిన జగన్
- కార్యక్రమంలో పాల్గొన్న బొత్స, సీఎస్, ఇతర అధికారులు
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా వాలంటీర్లు చేస్తున్న సేవలను ముఖ్యమంత్రి జగన్ కొనియాడారు. వాలంటీర్ల వల్ల గ్రామ స్వరాజ్యం వచ్చిందని అన్నారు. సాయంత్రం ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి వాలంటీర్లకు సంఘీభావం తెలుపుతూ చప్పట్టు కొట్టి అభినందించాలని జగన్ పిలుపునిచ్చారు.
తన పిలుపుమేరకు తాడేపల్లిలోని తన నివాసంలో రాత్రి 7 గంటలకు జగన్ చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, పలువురు అధికారులు పాల్గొన్నారు. అందరూ చప్పట్లు కొడుతూ సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చప్పట్లతో వాలంటీర్లకు అభినందనలు తెలిపారు.