మీరు రోడ్డు మధ్యలో ఉన్నారని గుర్తించండి మేడం: ఓ మహిళకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హితవు
- ఇటీవలే ప్రారంభమైన దుర్గం చెరువు బ్రిడ్జి
- బ్రిడ్జి వద్ద సందర్శకుల తాకిడి
- నడుస్తున్న ట్రాఫిక్ నడుమ మహిళ ఫొటో షూట్
హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద ఇటీవలే అత్యాధునిక కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఇప్పుడు హైదరాబాదులో ఈ కేబుల్ వంతెన కూడా ఓ పర్యాటక స్థలంగా మారింది. నిత్యం పెద్ద సంఖ్యలో ఈ బ్రిడ్జిని సందర్శిస్తున్నారు. ఈ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన లైటింగ్ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. దాంతో అక్కడ నిల్చుని ఫొటోలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది.
అయితే, ఓ జంట దుర్గం చెరువు వంతెనపై రోడ్డు మధ్యలో నిల్చుని ఫొటోలు దిగుతున్న ఓ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ లో పంచుకున్నారు. ఆ వీడియోలో... రోడ్డుపై ట్రాఫిక్ నడుస్తున్నప్పటికీ మహిళ నడిరోడ్డులో నిల్చుని పోజులిస్తుండగా, మరో వ్యక్తి ఫొటోలు తీస్తుండడం చూడొచ్చు.
దీనిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం స్పందిస్తూ, ఫొటో ప్రపంచం నుంచి బయటికి వచ్చి మీరు రోడ్డు మధ్యలో ఉన్నారని గుర్తించండి మేడం అంటూ హితవు పలికారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. వేలల్లో లైకులు, వందల్లో రీట్వీట్లు వస్తున్నాయి.