'పలాస 1978' నాకు ఎంతో నచ్చింది: అల్లు అర్జున్
- 'పలాస' టీమ్ ను అభినందించిన అల్లు అర్జున్
- దర్శకుడు కరుణకుమార్ కు మొక్కను బహూకరించిన బన్నీ
- ధన్యవాదాలు తెలిపిన కరుణకుమార్
ఈ ఏడాది మార్చిలో విడుదలైన 'పలాస 1978' చిత్రం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. మంచి వసూళ్లను రాబట్టింది. వెనుకబడిన కులాలకు చెందిన వారిని రాజకీయంగా ఎలా దోచుకుంటారో ఈ సినిమాలో చూపించారు. రక్షిత్, నక్షత్ర ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమాకు కరుణకుమార్ దర్శకత్వం వహించారు.
ఆనాటి సమాజంలోని కుల, వర్ణ వివక్షను దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమాను హీరో అల్లు అర్జున్ తాజాగా చూశారు. దీంతో దర్శకుడు కరుణకుమార్ ను ఆయన అభినందించారు. ఈ చిత్రం తనకు ఎంతగానో నచ్చిందని తెలిపాడు. ఒక మొక్కను బహుమతిగా అందించాడు. మరోవైపు బన్నీకి కరుణకుమార్ ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇదొక అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పారు.